మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

ఆస్ట్రేలియా కెప్టెన్సీ తప్పుకున్న స్మిత్ .. మంటకలిసిన పరువు

Updated: 25-03-2018 02:21:37

కేప్‌టౌన్‌:  బాల్ ట్యాంపరింగ్‌పై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని క్రికెట్ బోర్డును ఆదేశించింది. బాల్ ట్యాంపరింగ్‌ వ్యవహారంలో స్మిత్‌పై ఆరోపణలు వచ్చాయి. వ్యవహారం ముదరడంతో  స్మిత్ తప్పుకోవాల్సి వచ్చింది. వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పైనా వేటు పడింది. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంతో ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పరువు పోవడంతో సర్కారు సీరియస్ అయింది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్ట్  మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ కేమెరాన్ బెన్‌క్రాప్ట్ ఫీల్డింగ్ చేస్తూ తన ప్యాంట్‌లో ఏదో దాస్తూ కెమెరాలకు దొరికిపోయాడు. విచారణ జరిపాక బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు తేలడంతో అంతర్జాతీయంగా మరోసారి ఆస్ట్రేలియా పరువు మంట కలిసింది.     

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.